Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Prefix Suffix and Other Leaves

ప్రిఫిక్స్ & సఫిక్స్ 

టర్మ్ హాలిడేస్ (సంక్రాంతి సెలవులు / దసరా సెలవులు) కు ముందు రోజుగాని, సెలవులు తర్వాత రోజుగాని ఏరకమైన సెలవులు పెట్టరాదు. ఒకవేళ ఎవరైనా రానిచో మొత్తము సెలవుల కాలము అన్నియు కూడా అర్హత గల సెలవుగా పరిగణింపబడును. ఈ సెలవులకు (టర్మ్ సెలవులకు) ప్రిఫిక్స్ గాని, సఫిక్స్ గాని వర్తించదు. 10 రోజులకు మించిన సెలవులు కాబట్టి ఆకస్మిక సెలవులు కూడా వాడుకొనరాదు. (డి.ఎస్.ఇ ఆర్.సి.నం.10324/ఇ4-2/96 తేది 07-11-1969) 

సమ్మర్ హాలిడేస్ 

ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ అనునది సమ్మర్ వెకేషన్ కు వర్తించును మరియు ప్రభుత్వ సెలవు దినాలకు, ఆదివారాలకు కూడా వర్తించును. వేసవి సెలవులకు ముందురోజు పాఠశాలలకు రాకుండా సెలవుల అనంతరము రోజున అనగా రీ-ఓపెనింగ్ రోజున వచ్చినచో లేదా వేసవి సెలవులకు ముందు రోజు పాఠశాలకు వచ్చి రీ-ఓపెనింగ్ రోజున రానిచో అనుపస్థితి అయిన రోజున ఆకస్మికేతర సెలవుగా పరిగణించాలి. ఆరోజుకు ఇ.ఎల్ గాని, హాఫ్ పే లీవ్ గాని, కమ్యుటేడ్ సెలవు గాని, వేతనములేని సెలవుగాని వర్తించును. (Memo No 86595/1210/FR -I /7. Dt 29-05-1981)(FR 82(2)) (డి.ఎస్.ఇ ఆర్.సి.నం.815/E -1/1999 తేది 01-09-1999) 14 రోజులు దాటిన సెలవులను వెకేషన్  సెలవులుగా గుర్తించుతారు. 

 స్పెషల్ డీసెబిలిటీ లీవ్ 

ప్రభుత్వ ఉద్యోగులు / ఉపాధ్యాయులు తాను ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఉన్న సమయంలో గాని, లేదా ఎన్నికల విధులు నిర్వర్తించుచున్న సమయంలో గాని, కార్యాలయం పనికై తమ కార్యాలయం నుండి లేదా  కోర్టు కేసు విషయంలో వెళ్లుచున్నపుడు గాని, ఏదైనా రోడ్ ఆక్సిడెంట్ కు గురయినపుడు వైద్యుల సిపారసు మేరకు మూడు నెలల వరకు స్పెషల్ డీసెబిలిటీ లీవ్ మంజూరి చేయవచ్చును. రెండు నెలల వరకు అయితే గవర్నమెంట్ మెడికల్ అధికారి నుండి తెచ్చిన ధ్రువీకరణ సరిపోవును.
  1. ఒకవేళ మొదటిసారి చికిత్స తరువాత అంగవైకల్యం తిరిగి పునరావృతము అయి డీసెబిలిటీ ఏర్పడితే తిరిగి ఈ సెలవు పొందవచ్చు. ఈ డెసెబిలిటీ లీవ్ కు 2 నెలలకు మించినదయితే సివిల్ సర్జెన్ గారు వైద్య ధ్రువపత్రము జారీ చేస్తారు కానీ మొత్తం ఈ సెలవు 24 నెలలకు మించరాదు. 
  2. కార్యాలయము నుండి ఇంటికి లేదా ఇంటి నుండి కార్యాలయమునకు ప్రయాణించునపుడు యాక్సిడెంట్ జరిగితే సెలవుకు అర్హులు కాదు. 
  3. ఈ డెసెబిలిటీ సెలవును ఇతర సెలవులతో కలిపి పొందవచ్చును. 
  4. ఈ సెలవు పెన్షన్ కు డ్యూటీగా లెక్కించబడును. 
  5. మొదటి 4 నెలల వరకు పూర్తి వేతనం లభించును. ఆ తరువాత కాలమునకు అర్ధవేతనము సెలవుగా లెక్కించి సగము వేతనం లభించును. (జి.ఓ.యం.ఎస్.నం 133 ఫైనాన్స్ & ప్లానింగ్ డిపార్ట్మెంట్ తేది 10-06-1981 అండ్ FR 83) 

0 comments: