Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

కంపెన్సేటరీ లీవ్ - ఐచ్చిక సెలవులు - లోకల్ హాలిడేస్

కంపెన్సేటరీ లీవ్ (CCL):

ప్రభుత్వ సెలవు దినాన తప్పనిసరిగా ఉద్యోగ విధులకు కొందరు హాజరు కావలసిన అవసరం ఉండవచ్చు.  అలా ప్రభుత్వ సెలవు దినాన ఉద్యోగ విధులను నిర్వహించిన ఉద్యోగులకు ఆ సెలవుకు బదులు వేరొక రోజున సెలవుగా వాడుకునే అవకాశం కల్పించే వీలుంది. ఇలా వేరొక రోజున సెలవుగా వాడుకుంటున్నప్పుడు ఆ సెలవును కాంపెన్సేటరీ లీవ్ అంటారు. 
  • వేరొక రోజును కాంపెన్సేటరీ లీవ్ గా ఉపయోగించుకుంటున్నప్పుడు తప్పనిసరిగా తనకు సాధారణ క్యాజువల్ లీవ్ మంజూరు చేయగల అధికారుల నుండి కాంపెన్సేటరీ లీవ్ కు మంజూరి పొంది తీరాలి. 
  • ఒక క్యాలెండర్ సంవత్సరంలో మొత్తం 10 కి మించి కాంపెన్సేటరీ లీవ్ లు తీసుకునే వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 7కు మించి కాంపెన్సేటరీ సెలవులు ఖాతాలో ఉంచుకునే వీలులేదు. ఏ కాంపెన్సేటరీ సెలవునైనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి ఆరు నెలల లోపే తీసుకోవాలి. 
  • కాంపెన్సేటరీ సెలవులను సాధారణ క్యాజువల్ లీవ్ తో కలిసి తీసుకోవచ్చు. అయితే మొత్తం సెలవు ఒక్కసారి 10 రోజులకు మించకూడదు. (మెమో నం. 13112/Accts/67-2, తేది 01-03-1958 read with జి.ఓ.నం. 50 తేది 01-02-1968) 
  • కాంపెన్సేటరీ సెలవులను సాధారణ క్యాజువల్ లీవ్ ఉన్నప్పటికీ కూడా కాంపెన్సేటరీ సెలవులను తీసుకోవచ్చు. కాంపెన్సేటరీ సెలవుల నిమిత్తం వేరే లీవ్ రిజిస్టర్ నిర్వహించాలి. (మెమో నం. 934/Poli -B/63-2, GA (Poli.B)Dept తేది 23-04-1963) 

ఐచ్చిక సెలవులు 

ఉద్యోగులు ఒక క్యాలెండర్ సంవత్సరములో 5 ఐచ్చిక సెలవులు వాడుకొనవచ్చును కానీ ఉపాధ్యాయులు వ్యక్తిగతముగా వాడుకొనుటకు వీలులేదు. ఈ అయిదు రోజుల ఐచ్చిక సెలవులను జనవరి నెలలోనే నిర్ణయించి నిర్ణయించిన తేదీలను మండల విద్యాధికారి/ ఉపవిద్యాధికారి గారికి తెలియజేయాలి. ఆ నిర్ణయించిన తేదీలను ఐదు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించవచ్చును.

లోకల్ హాలిడేస్ 

 స్థానికంగా జాతరలు లేదా సమస్యలు లేదా స్థానిక అవసరాల దృష్ట్యా విద్యా సంవత్సరమునకు (3)రోజుల స్థానిక హాలిడేస్ ను సెలవుగా ప్రకటించే అధికారము ప్రధానోపాధ్యాయులకు కలదు. కానీ ముందుగా పర్యవేక్షణ అధికారులకు తెలియజేయాలి.

0 comments: