Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Leave Sanction - Joining Permission

సెలవులను ఎవరు మంజూరి చేస్తారు? ఎన్ని రోజులు మంజూరి చేస్తారు? 

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 70 తేదీ 06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరి చేయాలో వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయబడినవి, సెలవులు మంజూరు చేయు అధికారే జాయినింగ్ పర్మిషన్ ఇస్తారు. 
  1. ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధాయులు : ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరి చేస్తారు. 15 ఆకస్మిక సెలవులు, 7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు,  ఒకేసారి ఆకస్మిక సెలవులు/ ప్రత్యేక ఆకస్మిక సెలవులు మరియు సెలవులని మించకుండా మంజూరి చేయవలసి ఉండును. 
  2. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధాయుడు : ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకస్మిక సెలవులు/ ప్రత్యేక ఆకస్మిక సెలవులు/ ఆర్జిత సెలవులు/ అర్ధవేతన సెలవులు/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నాలుగు నెలల వరకు మంజూరి చేయవచ్చును. కానీ సెలవుల అనంతరం తిరిగి అదే పాఠశాలలో చేరి విధులు నిర్వర్తించాలి.
  3. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు :తన పరిధిలోని ప్రాధమికోన్నత /ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు 10 రోజుల వరకు ఆకస్మిక సెలవులు / ప్రత్యేక ఆకస్మిక సెలవులను మంజూరు చేస్తారు  
  4. మండల విద్యాధికారి :  ప్రాధమికోన్నత /ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు / అర్ధవేతనము సెలవులు / కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నాలుగు నెలల వరకు మంజూరి చేయవచ్చును. కానీ సెలవుల అనంతరం ఉపాద్యాయులు /ప్రధానోపాధ్యాయులు తిరిగి అదే పాఠశాలలో చేరి విధులు నిర్వర్తించాలి.
  5. ఉప విద్యాధికారి : తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల, ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు / ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ఉన్నత / ప్రాధమికోన్నత /ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/ అర్ధవేతన సెలవులు/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నాలుగు నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరి చేస్తారు.కానీ సెలవుల అనంతరం తిరిగి అదే పాఠశాలలో చేరి విధులు నిర్వర్తించాలి. 
  6. జిల్లా విద్యాధికారి : జిల్లాలోని ఉపవిద్యాధికారులకు, మండల విద్యాధికారులకు ఆకస్మిక సెలవులు / ప్రత్యేక ఆకస్మిక సెలవులు/ ఆర్జిత సెలవులు/ అర్ధవేతన సెలవులు/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు ఒకసంవత్సరం వరకు మంజూరి చేయవచ్చును. జిల్లాలోని అన్ని ఉన్నత/ ప్రాథమికోన్నత / ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి ఒక సంవత్సరం వరకు అన్ని రకాల సెలవులు మంజూరి చేస్తారు, కానీ సెలవుల అనంతరం తిరిగి అదే పాఠశాలలో చేరి విధులు నిర్వర్తించాలి. 
  7. డైరెక్టర్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ : మండల విద్యాధికారులకు/ ఉన్నత పాఠశాలల / ప్రాథమికోన్నత పాఠశాలల / ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను ఒకసంవత్సరం నుండి 4సంవత్సరాలవరకు సెలవు మంజూరు చేస్తారు, వారు తిరిగి పూర్వపు స్థానంలో / పాఠశాలలో మాత్రమే చేరి విధులు నిర్వర్తించవలసి ఉండును. 
సెలవు అనంతరం జాయినింగ్ పెర్మిషన్ 
     మంజూరయిన సెలవులను వాడుకున్నమరుసటిరోజు విధులలో చేరుటకు గాను అనుమతికై సెలవు మంజూరి అధికారికి వినతి పత్రం సమర్పించాలి. వైద్య కారణములపై సెలవు మంజూరి అయినచో వైద్యునిచే ఫిట్నెస్ సర్టిఫికెట్ జతపరచాలి. సెలవు మంజూరి అధికారి వెంటనే జాప్యము చేసినచో జాప్యము చేసిన అధికారి వేతనం నుండి రికవరీ చేసి వెయిటింగ్ చేసిన కాలమునకు ఆ ఉపాధ్యాయునికి వేతనం చెల్లించవలసి ఉండును. (జి.ఓ. యం.యస్.నం. 70 తేదీ 06-07-2009) 

జాయినింగ్ అనుమతి ఎవరు ఇవ్వాలి? 

     ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు నాలుగు నెలలు లేదా అంతకు లోపు సెలవు మంజూరి చేయించుకుని సెలవు పూర్తి అవగానే విదులలలో చేరడానికి అనుమతి కోరిన వారికి ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయుడే జాయినింగ్ అనుమతిస్తారు. 

   మండల విద్యాశాఖాధికారి పరిధిలోని ప్రాథమిక / ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులకు /ఉపాధ్యాయులు నాలుగు నెలలు లేదా అంతకు లోపు సెలవు మంజూరి చేయించుకుని సెలవు పూర్తి అవగానే విదులలలో చేరడానికి అనుమతి కోరిన వారికి మండల విద్యాశాఖాధికారి జాయినింగ్ అనుమతిస్తారు.

     అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు/ ప్రధానోపాధ్యాయులు నాలుగు నుండి ఆరు నెలల సెలవు మంజూరు చేయించుకుని సెలవు పూర్తి అవగానే విదులలలో చేరడానికి అనుమతి కోరిన వారికి ఉప విద్యాశాఖాధికారి జాయినింగ్ అనుమతిస్తారు. 

   అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు/ ప్రధానోపాధ్యాయులు ఆరు నుండి ఒక  సంవత్సరం వరకు సెలవు మంజూరు చేయించుకుని సెలవు పూర్తి అవగానే విదులలలో చేరడానికి అనుమతి కోరిన వారికి జిల్లా విద్యాశాఖాధికారి జాయినింగ్ అనుమతిస్తారు. 

  మండల విద్యాధికారులు ఒకసంవత్సరం వరకు సెలవులు వాడుకున్నచో వారికి జిల్లా విద్యాధికారి గారు జాయినింగ్ అనుమతినిస్తారు. 

  ఒక సంవత్సరం నుండి 4 సంవత్సరముల లోపల సెలవులు వాడుకున్న మండల విద్యాధికారులకు, ఉన్నత / ప్రాథమికోన్నత / ప్రాథమిక పాథశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు జాయినింగ్ అనుమతి డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఇస్తారు. 

(జి.ఓ. యం.యస్.నం. 70 తేదీ 06-07-2009) అదనపు సూచనలు (గైడ్లైన్స్) 
  1. సెలవు పై వెళ్లివచ్చి జాయినింగ్ పర్మిషన్ కోరిన ప్రధానోపాధ్యాయులకు / ఉపాధ్యాయులకు / మండల విద్యాధికారులకు పూర్వపు స్థానములో చేరుటకు మాత్రమే అనుమతిస్తారు. 
  2. మంజూరు అయిన సెలవులు వాడుకున్న తరువాత 15 రోజులలో చేరని వారి విషయంలో తప్ప ఎటువంటి సందర్భంలో సెలవు వెకెన్సీని భర్తీచేయరాదు. 
  3. సెలవు కాలము ముగిసిన తర్వాత విధులలో చేరని ఉపాధ్యాయుల వివరములు సెలవు కాలము ముగిసిన వారము లోపల సంబంధిత ప్రధానోపాధ్యాయుడు లేక మండల విద్యాధికారి గారు వెంటనే జిల్లా విద్యాధికారి గారికి రిపోర్ట్ చేయాలి. 
  4. జిల్లా విద్యాధికారిగారు ఆ ఉపాధ్యాయునికి వెంటనే విధులలో చేరమని నోటీసు పంపాలి. అతని నుండి ఏరకమైన స్పందన రానిచో అతని స్థానమున ఇతర ఉపాధ్యాయులచే భర్తీ చేస్తారు. సెలవుపై వెళ్లిన ఉపాధ్యాయుడు గణితం / సైన్స్ / ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు అయితే వెంటనే భర్తీ చేయాలి. 
  5. సెలవు కాలము ముగిసిన పిదప 15 రోజులలో జాయిన్ కానిచో అతనిని నాలుగవ క్యాటగిరికి చెందిన ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తూ అక్నాలెడ్జ్మెంట్ తో కూడిన  రిజిష్టర్ పోస్ట్ ద్వారా ఆ ఉపాధ్యాయుని ఇంటికి ఉత్తర్వులు పంపబడును. ఈ చర్య సెలవు కాలం ముగిసిన 15 రోజుల తర్వాత 7 రోజులలో జరగాలి. 
  6. పోస్టింగ్ ఆర్డర్ అందిన 15 రోజులలో నూతన పాఠశాలలో చేరనిచో ఈ ఉపాధ్యాయులకు తిరిగి జిల్లా విద్యాధికారి గారు ఒక నోటీసు సర్వ్ చేస్తూ డ్యూటీ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు, దానికి గాను క్రమశిక్షణ చర్యలు గైకొనబడునని, అనుపస్థితి కాలమునకు డైస్  నాన్ గా పరిగణించబడునని హెచ్చరిస్తారు. (డైస్ నాన్ అనగా ఆ కాలమును సర్వీస్ క్రింద లెక్కించరు.)
 కావున సెలవు కాలము పూర్తయిన వెంటనే విధులలో తప్పనిసరిగా జాయిన్ కావాలసియుండును. లేదా సరైనా కారణములు చూయించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా సెలవు పొడగింపు కోసం వినతి పత్రం పంపాలి. 

 వాడుకొను సెలవు  రకమును ఎవరు నిర్ణయిస్తారు? 

    సెలవు పై వెళ్లదలచిన ఉపాధ్యాయుడు తాను వాడుకొనదలచిన సెలవు రకమును తన వినతి పత్రము (అప్లికేషన్ ఫారం నెం. 11) యందు పొందుపరచాలి. ఉద్యోగి కోరుకున్న సెలవును అధికారి మంజూరు చేయాలి. సంబంధిత అధికారి పలానా సెలవు తీసుకొమ్మని ఉద్యోగిని / ఉపాధ్యాయుని బలవంత పెట్టరాదు. అనగా ఏరకము సెలవు కావాలో ఉపాధ్యాయుడే నిర్ణయించుకొను అధికారం కలిగి ఉంటాడు. (ఎఫ్.ఆర్. 67) అనారోగ్య కారణాలచే సెలవును కోరినచో వైద్య దృవపత్రం జతపరచాలి.