Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Earned Leave

ఆర్జిత లీవ్ (Earned Leave) :

  ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరమునకు 365/11 లెక్కన 33 వచ్చును. కానీ గరిష్టంగా సంవత్సరమునకు 30 రోజలకు మించకుండా సెలవు రిజర్వు చేయబడును. వెకేషన్ డిపార్టుమెంట్ లో పనిచేసే ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు 365/11 లెక్క చొప్పున 33 రోజులలో నుండి వేసవి సెలవులు వాడుకున్నందుకు గాను దాని నుండి 30 రోజులు తీసివేయాలి. అనగా 33-30 = 3రోజులు సెలవు రిజర్వు చేయబడును. ఈ నిబంధన 31-10-1989 వరకు అమలులో ఉన్నది. 

     తేదీ: 01-11-1989 నుండి 31-08-1994 మధ్యకాలంలో ఈ క్రింది లెక్కన (365/11)-28 = 33-28 =5రోజుల చొప్పున సంవత్సర కాలమునకు గాను ప్రిజర్వ్ చేయబడును(జి.ఓ. యమ్.ఎస్ నం. 354 తేది 20-11-1989). తేదీ 01-09-1994 తర్వాత ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 317 తేదీ 15-09-1994 ప్రకారం వెకేషన్ డిపార్టుమెంట్ లో పనిచేయుచున్న ఉద్యోగులకు ఉపాధ్యాయులకు (365/11)-27=6 రోజులు సెలవు ప్రిజర్వ్ అగును. ఈ సెలవులను రెండు దఫాలలో అడ్వాన్స్ గా జనవరిలో 3 మరియు జులైలో 3 చొప్పున ప్రిజర్వ్ చేయాలి. 

వేసవిలో పని చేసినచో సెలవు రిజర్వు :
       వెకేషన్ డిపార్టుమెంట్ లో పనిచేసే ఉద్యోగులు / ఉపాధ్యాయులు 23వ ఏప్రిల్ నుండి జూన్ 11 వ తేదీ వరకు వేసవి సెలవులు అనుభవించవచ్చును. కాని ప్రభుత్వం తమకు అవసరమయిన పనులు (ఎలక్షన్ వర్క్, ఓటర్ జాభితా తయారుచేయడము, సెన్సెస్, పల్స్ పోలియో, పదవతరగతి సప్లిమెంటరీ పరీక్షలు మరియు ఇతర పనులు) చేయించుకున్నప్పుడు, వేసవి సెలవులలో కొంతభాగము లేదా మొత్తం వేసవి సెలవులు వాడుకొనకుండా నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయును. అలంటి సంధర్భాల్లో ఆ ఉద్యోగులకు / ఉపాధ్యాయులకు ఎఫ్.ఆర్ 82 ప్రకారం సెలవు ప్రిజర్వ్ చేయమని డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఉత్తర్వులు ఇస్తారు. వేసవి సెలవు మొత్తం వాడుకొననిచో ఇతర ఉద్యోగులకువలె 365/11=33 (గరిష్టం 30) 30 రోజుల సెలవు రిజర్వు అగును. కాని ప్రతిసంవత్సరం యధావిదధిగా రిజర్వ్ చేయు ఆర్జిత సెలవు (ఇ.ఎల్) లను ఈ 30 రోజుల నుండి మినహాయించాలి. ఈ క్రింద తెలిపిన ఆయా కాలములో సెలవు ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేయాలో వివరించనైనది. 
  1. తేది 30-10-1989 కన్న ముందు వచ్చిన వేసవి సెలవులలో 15 రోజులకన్నా తక్కువ వేసవి సెలవులు వాడుకొనినచో 27 రోజులు (30-3=7 రోజులు) నిలువ చేయవచ్చును. (డైరెక్టర్ గారి ఆర్.సి.నెం. 1/85/పి. తేది 11-01-1985) 
  2. 15 రోజులకు మించి సెలవులు వాడుకున్నచో ద్యూటికి పిలిపించిన కాలము మరియు వేసవి సెలవుల కాలము పరిగణలోనికి తీసుకుని దామాషా ప్రకారము సెలవు రిజర్వు చేయవలసి యుండును. 
  3. తేది 01-09-1994 తరువాత వేసవి సెలవులలో పనిచేసిన వారికి ఈక్రింది సూత్రం ప్రకారము సెలవు ప్రిజర్వ్ చేయవలసి ఉండును(జి.ఓ.యమ్.ఎస్. నం. 317 తేది 15-09-1994) 
ఉదా.  
  • 16 రోజులు వేసవి సెలవులలో పనిచేసినచో అతనికి (365/11)-27X33/49 =15 రోజులు.  రెగ్యులర్ గా ప్రతి  సంవత్సరం ప్రిజర్వ్ చేయు 6 ఇ.ఎల్. లను  తీసివేయగా ఇంకను 9 రోజలు రిజర్వ్ చేయాలి. 
  • ఒకరు 11 రోజులు పనిచేసిన వారికి (365/11)-27X38/49=12 రోజులు -6రోజులు = 6 రోజులు రిజర్వు చేయాలి 

ఆర్జిత సెలవుల నిలువ గరిష్ట విలువ :  

  1. డిసెంబర్ 1982 వరకు ఆర్జిత సెలవుల నిలువ గరిష్ఠపరిమితి 180 రోజులు ఉండేవి. 
  2. జనవరి 1983 నుండి 15-09-2005 మధ్యకాలంలో ఆర్జిత సెలవులు & ప్రిజర్వ్ సెలవులు కలిపి నిలువ ఉంచుకొను గరిష్ఠ పరిమితి 240 రోజులుగా ఉండినవి. (జి.ఓ.యం.ఎస్. నం. 10 తేది 10-01-1983)
  3. తేది 16-09-2005 నుండి ఆర్జిత సెలవులు + ప్రిజర్వ్ సెలవులు కలిపి నిలువ ఉండవలసిన గరిష్ఠ పరిమితి 300 రోజులకు పెంచబడినది. (జి.ఓ.యం.ఎస్. నం. 232 తేది 16-09-2005)
     Note : గరిష్ఠ పరిమితి (300రోజులు) కన్నా మించిన ఆర్జిత సెలవులు లాప్స్ అవుతాయి. 
  • నిలువ ఉన్న ఆర్జిత సెలవులను 03-05-2010 లోపల అయితే 120 రోజుల వరకు ఒకేసారి వాడుకొనవచ్చును. (APLR Rule.III) తేది 04-05-2010 తర్వాత ఈ  ఆర్జిత సెలవులను ఒకేసారి 180 రోజుల వరకు వాడుకొనవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 153 Fin (FR.I) Dept. తేది 04-05-2010) 

ఆర్జిత సెలవు సరెండర్ : 

      గరిష్ఠ పరిమితికి మించకుండా లేదా ఆర్ధిక అవసరాల దృష్టి ప్రతి ఉద్యోగి/ ఉపాద్యాయుడు సంవత్సరమునకు 15 రోజుల ఆర్జిత సెలవులను / ప్రిజర్వ్ చేసిన సెలవులను ప్రభుత్వమునకు సరెండర్ చేసి నగదు డబ్బులు పొందవచ్చును. ఒక సంవత్సరములో సరెండర్ చేయని వారు రెండవ సంవత్సరంలో 30 రోజుల ఆర్జిత సెలవులను సరెండర్ చేయవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 334 Fin. Dept. తేది 28-09-1997) 
       గతంలో సరెండర్ చేసిన తేది నుండి 12 నెలల కాలము గడచిన తర్వాత 15రోజులు 24 నెలల కాలము గడచిన వారు 30 రోజులు ఆర్జిత / ప్రిజర్వ్ సెలవులను సరెండర్ చేసుకొ వచ్చును.  
Govt. Memo No. 10472/C199/PR.I/2009 Dt. 29-04-2009 మరియు Govt. Memo No. 14781-C/278/FR.I/2011 Dt. 22-06-2011 ప్రకారం 12నెలలు/30నెలలు అంతరంతో ఏ నెలలో అయినా సరెండర్ చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 30వ తేది నాటికి 286 లేదా అంతకంటే ఎక్కువ ఇ.ఎల్. లు నిలువ ఉన్నవారు వేచి చూడకుండానే సెలవులు సరెండర్ చేసుకొనవచ్చును. 

ఆర్జిత సెలవులతో కలిపి ఏ ఏ సెలవులు వాడుకొనవచ్చు? 

      ఆర్జిత సెలవులతో కలిపి ఆకస్మిక సెలవులు తప్ప ఇతర రకాల సెలవులతో (అర్ధవేతనము సెలవు, కమ్యుటేడ్ సెలవు, వేతనము లేని సెలవు మొదలగువాటితో) కలిపి వాడుకొనవచ్చు. వేసవి సెలవులకు ముందుగాని లేక సెలవు తరువాత గాని సెలవులతో కలిపి వాడుకొనవచ్చు. వేసవి సెలవులకు ముందు రోజుగాని లేక తరువాత రోజుగాని రోజు తప్పనిసరిగా డ్యూటిలో ఉండాలి. (లాస్ట్ వర్కింగ్ డే గాని, రీ ఓపెనింగ్ డే గాని, ఎదో ఒక రోజు తప్పనిసరిగా డ్యూటిలో ఉండాలి.) లేనిచో వేసవి సెలవులు మొత్తము సెలవుగా పరిగణించబడును. 

ఆర్జిత సెలవులను ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చును? మిగిలియున్న సెలవులు ఏమి చేయాలి? 

     అవసరముల దృష్ఠా ఆర్జిత సెలవులను ఒకేసారి 180 రోజులకు మించి వాడుకొనరాదు. చేలంచలుగా 180 రోజుల చొప్పున  (ప్రతిసారి) వాడుకోనుటకు అవకాశము కలదు. పదవీ విరమణ పొందిన తరువాత మిగిలిన ఉన్న సెలవులను (300 రోజుల గరిష్ఠపరిమితి) అమ్ముకుని నగదుగా మార్చుకోవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 232 తేది 16-09-2005) 
Posted in: