Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Available Leaves - PRTU కృషి

సెలవు నిబంధనలు - పరిచయం 

ప్రభుత్వం తన ఉద్యోగులకు, ఉపాద్యాయులకు వివిధ రకాల సెలవులను వాడుకొనుటకు అవకాశం కలిగిస్తూ నిబంధనలు రూపొందించింది. ఈ నియమ నిబంధనలు ఆం.ప్ర. లీవ్ రూల్స్ 1933 లోను ఫండమెంటల్ రూల్స్ లో పొందుపరిచారు. 
సెలవు : ఉద్యోగి తన సర్వీసులో అత్యవసర పరిస్థితులలో లేదా అనారోగ్య కారణాలతో భాధపడుచున్నపుడు డ్యూటీ నుండి మినహాయింపు నిచ్చే అనుమతినే సెలవు అంటారు. 
సెలవులలో రకాలు : ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవులు ఐచ్చిక సెలవులు రెండవ శనివారాలు, ఆదివారాలు, విద్యాశాఖలో అయితే వేసవి సెలవులు, టర్మ్ హాలిడేస్ పోగా నిబంధనలకు అనుగుణంగా మిగితా ప్పనిదినాలలో ఉద్యోగి కోరిన సందర్భంలో ఈక్రింది రకాల సెలవులు మంజూరి చేయవచ్చు. 
  • ఆర్జిత సెలవు (E.L ) 
  • అర్థవేతనం సెలవు (H.P.L)
  • వేతనం లేని సెలవు (E.O.L )
  • ఆకస్మిక సెలవులు (C.L)
  • ప్రత్యేక ఆకస్మిక సెలవులు (Spl.C.L)
  • కంపెన్సేటరీ లీవ్ (C.C.L)
  • ప్రసూతి సెలవులు 
  • పితృత్వ సెలవులు 
  • స్పెషల్ దిజాబిలిటీ లీవ్ 
  • లీవ్ నాట్ డ్యూ

PRTU కృషిమేరకు లభించిన సెలవు సౌకర్యాలు 

      ఈనాడు అందరం ఉపాధ్యాయులం అనుభవిస్తున్న సెలవులు పంచాయతీరాజ్ సంస్థలలో పనిచేయు ఉపాధ్యాయులకు వర్తించేవి కావు. అవి 
      ఆకస్మిక సెలవు/ ప్రత్యేక ఆకస్మిక సెలవు, ప్రసూతి సెలవు, సరెండర్ సెలవు, Encashment లీవ్, (పదవీ విరమణ తరువాత నగదుగా మార్చుకునే సెలవు) మరియు దీర్ఘ కాళికా వ్యాదులైన క్షయ, కుష్టు, గుండె, క్యాన్సర్, కిడ్నీ, వ్యాధులకు ఇచ్చు 6 నెలల ప్రత్యేక సెలవులు ఏవియు కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఉండేవి కావు. 
  1. PRTU 1971 లో ఏర్పడిన తరువాత PRTU ప్రతినిధ్యము మేరకు పి.ఆర్ మహిళ ఉపాధ్యాయినీలకు ప్రసూతి సెలవులు G.O.Ms.No 463 తేదీ 04-05-1979 ద్వారా లభించినవి. 
  2. సరెండర్ సెలవు సౌకర్యం G.O.Ms.No 418 తేదీ 18-04-1979 ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు వర్తింపచేయబడినవి. 
  3. పదవీ విరమణ తరువాత లభించు ఇ.ఎల్ నగదు గా మార్చుకునే సౌకర్యాన్ని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు  తేదీ 31-03-1985 నుండి G.O.Ms.No 264 తేదీ 08-08-1985 ద్వారా లభించినవి. 
  4.  దీర్ఘకాలిక వ్యాదులకిచ్చు 6 మాసాల అర్ధవేతన సెలవుకు పూర్తివేతనం ఇచ్చు సౌకర్యం కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు  G.O.Ms.No 590 తేదీ 06-08-1980 ద్వారా లభించినది. 
  5. PRTU 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశమునకు అప్పటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మహిళలకు 5 అదనంగా ఆకస్మిక సెలవులు  G.O.Ms.No 374 తేదీ 16-03-1996 ద్వారా సాధించారు. 
  6. భార్య ప్రసవిస్తే పురుషులకు కూడా 15 రోజుల పితృత్వ సెలవులు G.O.Ms.No 231 తేదీ 16-09-2005 ద్వారా 15 రోజుల పితృత్వ సెలవులను ఇప్పించారు. 
  7. అనేక విద్యా సదస్సులు నిర్వహింపచేసి ఆసదస్సులకు మరియు క్రీడోత్సవాలు ఏర్పాటు చేసి వాటికి ఉపస్థితులయిన వారికి ఓ.డి. సౌకర్యం కల్పించుటలో మన సఘం కృషి అమోఘము.
  8. అంతెందుకు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం TTJAC తరపున నిర్వహించిన సమ్మె కాలానికి O.D సౌకర్యం ఇప్పించుటలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల కృషి వెలకట్టరానిది.